Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2025, 6:05 pm Posted by : ramakrishna

సబ్ స్టేషన్ ఆపరేటర్ సస్పెన్షన్

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ సెక్షన్ లో అసిస్టెంట్ గ్రేడ్ -2 సబ్ స్టేషన్ ఆపరేటర్ గా పని చేస్తున్న సి.హెచ్.గంగాసాగర్ ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ డివిజనల్ ఇంజనీర్ ఎం.శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10న నందిపేట్ సబ్ స్టేషన్ లో మద్యం సేవించి విధులు నిర్వహించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.