నందిపేట్ తహసీల్దార్ సస్పెన్షన్

  నిజామాబాద్, బతుకమ్మ :   నిబంధనలకు విరుద్దంగా అసైన్మెంట్ భూములను నందిపేట్ తహసీల్దార్ సంతోష్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించిన జిల్లా కలెక్టర్ .. విచారణ జరిపించిన అనంతరం సస్పెండ్ చేసారు. మండలంలోని ప్రతి గ్రామంలో అసైన్మెంట్ భూములు అధికంగా ఉన్నాయి. ఆస్తి బదలాయింపు కోసం వేచి ఉన్న దరఖాస్తులను లబ్దిదారులతో మాట్లాడుకొని వాటిని పట్టాలు చేస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదులు వెళ్ళాయి. దీనిపై ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ విచారణ చేసి కలెక్టర్ కు నివేదికను అందజేశారు. దీనిపై స్పందించిన...