Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 3:59 pm Posted by : ramakrishna

జుక్కల్  అగ్రికల్చర్ ఆఫీసర్ మహేశ్వరి సస్పెన్షన్

… ఎన్ పోర్స్ మెంట్ తనిఖీల వివరాలు డీలర్లీలకు లీక్ 

. . .  కఠీన చర్య లకు వ్యవసాయ శాఖ నిర్ణయం

 జుక్కల్, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా జుక్కల్ అగ్రికల్చర్ ఆఫీసర్ మహేశ్వరి ని సస్పెండ్ చేస్తు జిల్లా  వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జుక్కల్ మండలం వ్యవసాయ అధికారి గా పనిచేస్తున్న మహేశ్వరి స్థానికంగా మండలం లో ప్రైవేట్ ఫర్టిలైజర్స్ నిర్వహకులతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ తనిఖీల ( ఎన్ ఫోర్స్ మెంట్) వివరాలను ముందే లీక్ చేస్తున్నారు ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. మండలం మహారాష్ట్ర, కర్నాటకకు సరిహద్దులుగా ఉండటంతో నకిలి విత్తనాలు, పురుగుల మందుల గురించి తనిఖీలు లేవని కూడా కొందరు జిల్లా  వ్యవసాయ అధికారి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో శాఖ పరమైన విచారణ చేసి జుక్కల్ ఎఓ మహేశ్వరి ని సస్పెండ్ చేస్తూ  ఉత్తర్వులు వెలువడిన అవి ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.  ఎన్ పోర్స్ మెంట్ తనిఖీల వివరాలను కొందరు డీలర్లు ఎఓ మహేశ్వరి పోస్టు చేయగా దానిని స్క్రిన్ షార్ట్ తీసి పంపడంతో అమే పై వేటుకు కారణమైంది.మహేశ్వరి స్థానంలో పెద్ద కొడప్ గల్ ఎఓ కిషన్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.

Suspension of Jukkal Agriculture Officer Maheshwari