– విద్యార్థినులపై పంతుళ్ల లైంగిక వేధింపులు
– కేసు నమోదు
నిజాంసాగర్, బతుకమ్మ: జవహార్ నవోదయ విద్యాలయంలో విద్యార్థినులను లైంగింకంగా వేధించిన నలుగురు ఉపాధ్యాయులను సంబంధిత అధికారులు సస్పెండ్ చేశారు. నలుగురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని నవోదయ విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో గతంలో ఓ ఉపాధ్యాయుడిని కర్నాటకకు బదిలీ చేశారు.