Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 6:25 pm Posted by : ramakrishna

బోల్లారం ఎఫ్ఎస్ వో సస్పెన్షన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అటవీ రేంజ్ పరిధిలోని బోల్లారం సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న విక్కిమార్టిన్  ను సస్పెండ్ చేస్తూ పీసీసీఎఫ్ వో ఉత్తర్వులు జారీ చేశారు. బోల్లారం అటవీ సెక్షన్ పరిధిలోని ఎక్కపల్లి తాండ, ఎక్కపల్లి, పర్మల్ల, శెట్ పల్లి అటవీ బీట్ ల పరిధిలో అడవుల నరికివేత, అటవీ భూముల ఆక్రమణలను నిరోధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎఫ్ ఎస్ వోను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. కామారెడ్డి జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటన చేసి బోల్లారం సెక్షన్ పరిధిలో అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను నరికివేసి భూములను ఆక్రమించినట్లు గుర్తించారు. ఇది వరకే శెట్ పల్లి బీట్ ఆఫీసర్ శ్యాంసుందర్ ను సస్పెండ్ చేయగా తాజాగా ఎఫ్ ఎస్ వో విక్కి మార్టిన్ పై చర్యలు తీసుకోవడం కలకలం రేపింది.