ప్రస్తుతానికి సస్పెన్సన్ ఎత్తివేత
. ఆందోళన విరమించిన ఏఈవోలు . డీసీఎస్ యాప్ వేసుకుంటే సరే . లేదంటే కక్ష సాధింపు చర్యలే.. హైదరాబాద్, బతుకమ్మ: డిజిటల్ క్రాఫ్ సర్వేకు ససేమిరా అంటున్న ఏఈవోలను దారిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం సస్పెన్షన్ వేటును ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రధాన కార్యాలయం ఎదుట ఏఈవోలు నిరసనకు దిగారు. ఏఈవోలు డీసీఎస్ (డిజిటల్ క్రాఫ్ట్ సర్వే) యాప్ వేసుకోవాల్సిందేనని, అలాగైతేనే సస్పెన్షన్ తొలగిస్తామని ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. చేసేదిలేక అధికారులు చెప్పినట్లు నడుచుకునేందుకు ఏఈవోలు ఒప్పుకోవడంతో...