సస్పెండెడ్ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ అరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సిరిసిల్ల జిల్లాకు చెందిన సస్పెండెడ్ ఎస్సై శ్రీకాంత్ గౌడ్‌ను నిజామాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. యువతి ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీకాంత్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి పోలీసుల కంట పడకుండా తిరుగుతున్న అతడిని సెల్‌ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా నిజామాబాద్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు....