Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2024, 5:04 pm Posted by : ramakrishna

ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో గురువారం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పిట్లం మండల ఎంపిఒ యాదగిరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గ్రామంలోని అర్హులైన ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శి భాస్కర్ కి ఎంపీఓ సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కరోబర్ కృష్ణ,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.