బడి బయట పిల్లల సర్వే పరిశీలన
నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ మండలం లో జరుగుతున్నటువంటి బడి బయట పిల్లల సర్వేను మంగళవారం నాడు మండల విద్యాధికారి వై తిరుపతిరెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశానుసారం ప్రతి సంవత్సరం నిర్వహించే బడి బయట పిల్లల గుర్తింపులో భాగంగా మండలంలో ఈనెల 11 వ తారీకు నుండి బడి బయట పిల్లల గుర్తింపు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు మండలంలోని రెండు కాంప్లెక్స్ పరిధిలో 21 మంది బడి బయట విద్యార్థులను గుర్తించడం జరిగిందన్నారు. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని...