Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2024, 4:39 pm Posted by : ramakrishna

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పరిశీలన

నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ను గురువారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఇంటింటికి తిరిగి ఇండ్లను పర్యవేక్షించారు. ఎలాంటి తప్పులు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్ , ఎమ్మార్వో బిక్షపతి, ఎంపీవో అనిత, ఐకెపి రామ్ నారాయణ గౌడ్ ,ఏపీఎం , కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.