పీఎఫ్ఐ సభ్యుడు అహద్ లొంగుబాటు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: విద్వేషాలను రెచ్చగొట్టేందుకు, మత కల్లోలాలు, దాడులను ప్రోత్సహించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యువతకు శిక్షణ ఇచ్చిన నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( పీఎఫ్ఐ) కీలక సభ్యుడు అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్ నాంపల్లి కోర్టులో లొంగిపోయినట్లు తెలిసింది. నిజామాబాద్ నగరంలోని మాలపల్లికి చెందిన అబ్దుల్ అహద్ అలియాస్ అహద్ 2023 నుంచి పరారీలో ఉన్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఖదీర్ తో కలిసి పీఎఫ్ఐ కార్యకలపాలను విస్తరించేందుకు యువతకు శిక్షణ ఇవ్వడంతో నిజామాబాద్ ఆరో...