Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2024, 4:57 pm Posted by : ramakrishna

సురేష్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం

బతుకమ్మ, మోర్తాడ్ :మోర్తాడ్ మండల కేంద్రంలోని మొండి వాగులో వ్యవసాయ కూలి గాయచోడి సురేష్ చనిపోవడం జరిగింది. సురేష్ కుటుంబానికి మంగళవారం మోర్తాడ్ ఎమ్మార్వో సత్యనారాయణ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం చేశారని పేర్కొన్నారు. ఈ తక్షణ సహాయానికి సహకరించిన బాల్కొండ నియోజక వర్గ ఇంచార్జి ముత్యల సునీల్ రెడ్డి, మోర్తాడ్ రెవిన్యూ సిబ్బందికి, మోర్తాడ్ మండల పరిషత్ అధికారులకు, మోర్తాడ్ పోలీస్ సిబ్బందికి, మోర్తాడ్ గ్రామపంచాయతీ సిబ్బందికి, ఇట్టి ఆర్థిక సహాయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా కాంగ్రెస్ సెక్రెటరీ గిర్మాజి గోపి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మోర్తాడ్ ఎస్సై విక్రమ్, ఆర్ఐ రంజిత్ కుమార్, సురేష్ భార్య పోసవ్వ తదితరులు పాల్గొన్నారు.