Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2025, 2:41 pm Posted by : ramakrishna

కుంభమేళా తొక్కిసలాటపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ, బతుకమ్మ :  ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  ఈఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది.  ఈఘటనకు సంబంధించి ఉత్తర్ ప్రదేశ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిల్ ను సోమవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచనలు చేసింది. మహాకుంభమేళాలో మౌని అమామాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈఘటనపై యూపీ ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు ఆదేశించింది.