వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
డిల్లీ,బతుకమ్మ : వక్ఫ్ బోర్డు సవరణ చట్టం-2025లో కీలక ప్రొవిజన్ ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. కనీసం ఐదేళ్లు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసే వరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. కొన్ని సెక్షన్లకు రక్షణ అవసరమని న్యాయస్థానం వ్యాఖ్యనించింది. అదే సమయంలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టం-2025 పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.