వక్ఫ్ బోర్డు కేసులో సుప్రీం తీర్పు ముస్లింల నైతిక విజయం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వక్ఫ్ బోర్డు అంశంలో సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పు ముస్లిం సమాజానికి నైతిక విజయంగా నిలిచిందని ముస్లిం పర్సనల్ లా కమిటీ జిల్లా సభ్యుడు, ఖౌమీ తంజీమ్ నిజామాబాద్ జోన్ చైర్మన్ సుమీర్ అహ్మద్ పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఈ తీర్పు దిశానిర్దేశకంగా ఉండబోతుందని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ముస్లింల తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాత్ర ప్రశంసనీయమని అన్నారు....