Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 1:14 pm Posted by : ramakrishna

ఫిరాయింపుల కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ ముగిసింది. ఫిరాయింపుల కేసులో తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ తరపు అడ్వకేట్ ఆర్యమా సుందరం కోరాడు. ఎమ్మెల్యేలు పార్టీ  మారిన వ్యవహారంపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, కేటీఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డి తరపున ఆర్యామ సుందరం, తెలంగాణ స్పీకర్ తరపున అభిషేక్ మను సింగ్వీ వాదనలు వినిపించారు. అనంతరం ఇరు పక్షాల వాదనలు ముగించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన ఉపఎన్నికలు రావు అన్న మాటలను న్యాయవాది ఆర్యామ సుందరం మరోసారి ప్రస్తావించారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ సీఎం కనీసం స్వీయ నియంత్రణను పాటించలేరా అని ప్రశ్నించారు.