గ్రూప్ – 1 నియామకాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ :  గ్రూప్ - 1 నియామకాల్లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేసినా వారికి ఆ ఉద్యోగాలపై ఎలాంటి హక్కులేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిందంటే ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులను చేసిందో సుప్రీం కోర్టు ఎత్తిచూపినట్టేనన్నారు. గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల వివాదం న్యాయ స్థానాల్లో తేలే వరకు అభ్యర్థుల...