Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 7:19 pm Posted by : ramakrishna

గ్రూప్ – 1 నియామకాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి

  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ :  గ్రూప్ – 1 నియామకాల్లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేసినా వారికి ఆ ఉద్యోగాలపై ఎలాంటి హక్కులేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిందంటే ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులను చేసిందో సుప్రీం కోర్టు ఎత్తిచూపినట్టేనన్నారు. గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల వివాదం న్యాయ స్థానాల్లో తేలే వరకు అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను తొందరపడి డిస్పోజ్ చేయొద్దని, తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ -1 నోటిఫికేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అనేక తప్పులు చేసిందని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను తుంగలో తొక్కిందన్నారు. న్యాయస్థానాలు తుది తీర్పు ఇచ్చేలోపు ప్రభుత్వం అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను డిస్పోజ్ చేస్తే నిరుద్యోగులతో కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను స్తంభింపచేస్తామని హెచ్చరించారు.