సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు
వెబ్ న్యూస్, బతుకమ్మ : కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో 2023లో ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ శంకర అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడ్డారని, ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం అతని ఎన్నిక చెల్లదని పేర్కొన్నారు. దీంతో వివరణ ఇవ్వాలని సిద్ధరామయ్యకు సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.