Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 1:58 pm Posted by : ramakrishna

కేంద్రం, ఓటీటీలకు సుప్రీం నోటీసులు

డిల్లీ, బతుకమ్మ : కేంద్రంతో పాటుపలు ఓటీటీలు, సామాజిక మాధ్యమాల హ్యండిళ్లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.  ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సెక్సువల్ కంటెంట్ పై నిషేధం విధించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎలాంటి చెకింగ్ లేకుండా ఓటీటీలో సెక్సువల్ కంటెంట్ ప్రసారం చేస్తున్నారని, దీంతో చిన్నపిల్లలు, యువత అడల్ట్ కంటెంట్ అడిక్టు అవుతున్నారని తద్వారా నేరాల  రేటు పెరుగుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈపిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది.  ఈవ్యవహారంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసిందని సుప్రీం కోర్టుకు సొలిసిటర్ జనరల్ వెల్లడించారు. కార్య నిర్వహక, శాసన వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామని మాపై ఇప్పటికి ఆరోపణలు వస్తున్నాయని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. దీంతో ఓటీటీ కంటెంట్ పై సుప్రీం కోర్టు తీర్పు ఏంటనే ఉత్కంఠ నెలకొంది.