Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 7:34 pm Posted by : ramakrishna

 ప్రజాహిత వాజ్యాన్ని కొట్టేసిన సుప్రీంకోర్టు

  • కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి 

బతుకమ్మ,మద్నూర్: భారతదేశ ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసిందనీ జుక్కల్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజక వర్గ ఓటర్ నమోదు అధికారి (కామారెడ్డి అదనపు కలెక్టర్)  డి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈవీఎం ట్యాంపరింగ్‌ పై, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని వేసిన పిటిషనర్ చేసిన వాదనలను సుప్రీం కోర్టు తిరస్కరించిందనీ, ఈవీఎంల విశ్వసనీయతపై ప్రశ్నించే వారి అస్థిరతను ఎత్తిచూపిందని తెలిపారు. ఎంతో మంది ఐఏఎస్/ ఐపీఎస్ స్థాయి అధికారుల నుండి కింది స్థాయి ఉద్యోగి వరకు వ్యవస్థ పై నమ్మకంతో పని చేస్తూ ఎన్నికల సంగ్రహంలో ఎంతో పారదర్శకంగా ఎన్నికలను నిర్వహిస్తున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది అని తెలిపారు.