నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు మద్దతివ్వండి

పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు వినతిపత్రం అందజేత   ఆర్మూర్, బతుకమ్మ : బోధన్‌లోని ప్రసిద్ధ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం చేపట్టిన ఉద్యమానికి మద్దతు కోరుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగకు ఆర్మూర్ పట్టణంలో మంగళవారం వినతిపత్రం సమర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడ్లూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ కార్మికులు, బోధన్ యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరకు పంటకు కేంద్రబిందువుగా నిలిచిన బోధన్ ప్రాంతం, చక్కెర కర్మాగారం మూతపడిన నాటి నుంచి తీవ్రంగా...