జర్నలిస్టులకు అండగా ఉంటా
ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు అండగా ఉంటానని ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు. జర్నలిస్టుల వరుస మరణాలు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఒత్తిడులు తగ్గించుకుంటు జర్నలిస్టులు ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. జిల్లాకు పసుపు బోర్డు సాధించిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ లో పర్యటిస్తున్న అరవింద్ ను జర్నలిస్టులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సుభాష్ నగర్ లోని తన నివాసంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు...