పవర్ హౌస్ లో బీసీ బందుకు మద్దతు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పవర్ హౌస్ లో బీసీ బందుకు మద్దతుగా భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బీసీ బందుపై బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రసంగించారు. కార్యక్రమంలో విద్యుత్ బిసి సంక్షేమ సంగం ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సురేష్ కుమార్ మాట్లాడుతూ బీసీ బందుకు మద్దతు పలుకుతూ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశామని శాసనమండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి 42 శాతం బీసీలకు రిజర్వేషన్ల బిల్లు గవర్నర్, రాష్ట్రపతి కి పంపడం అది అక్కడే ఆగిపోవడం...