నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పవర్ హౌస్ లో బీసీ బందుకు మద్దతుగా భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బీసీ బందుపై బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రసంగించారు. కార్యక్రమంలో విద్యుత్ బిసి సంక్షేమ సంగం ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సురేష్ కుమార్ మాట్లాడుతూ బీసీ బందుకు మద్దతు పలుకుతూ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశామని శాసనమండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి 42 శాతం బీసీలకు రిజర్వేషన్ల బిల్లు గవర్నర్, రాష్ట్రపతి కి పంపడం అది అక్కడే ఆగిపోవడం అసలు ప్రశ్న ఏంటంటే అన్ని పార్టీలు మద్దతు తెలిపిన తర్వాత మరి ఎక్కడ అవుతుంది అనేది ప్రశ్న అన్నారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని 42% బీసీలకు రిజర్వేషన్ సాధించేవరకు ఆగేది లేదని సెంట్రల్ కమిటీ ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తే ఆ విధంగా ముందుకు సాగుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్తు వివిధ సంఘాల నాయకులు రఘునందన్ 1104 యూనియన్ కంపెనీ అధ్యక్షులు, బీసీ సంఘం అధ్యక్షుడు రమణ వర్కింగ్ ప్రెసిడెంట్ టి హరికృష్ణ వివిధ సంఘాల నాయకులు డి ఈ డి పి కామేశ్వరరావు, తోట రాజశేఖర్ ,ఆర్ బాలేష్ కుమార్, ఆర్ మల్లేష్ జి శ్రీనివాస్ రాజేందర్ గౌడ్ శంకర్ గౌడ్, దుర్గాప్రసాద్ ఆనంద్ ఉమారాణి, సునీత ,కుమారి దివ్య, మూర్తి, లింగం ఆనంద్ దాదాపు 100 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
