సిఏంఆర్ సరఫరా వేగవంతం చేయాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : సి.ఏం.ఆర్. సరఫరా వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం పాల్వంచ మండలం భవానీపేట్ గ్రామంలోని గాయిత్రి అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లు ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సి.ఏం.ఆర్. సరఫరా త్వరితగతిన చేయాలని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం, సరఫరా చేయాల్సిన బియ్యం వివరాలను పౌరసరఫరాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లును శుభ్రంగా ఉంచాలని మిల్లు యజమానికి తెలిపారు. ఈ...