రోజుకు 26లక్షల బీరు సీసాల సప్లై
. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీల ప్రణాళిక . బీరు ప్రియలకు ‘నో స్టాక్’ ఇబ్బందులు లేకుండా చర్యలు వెబ్ న్యూస్, బతుకమ్మ: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో డిమాండ్ మేరకు బీర్లు సప్లై చేసేందుకు బీర్ల తయారీ కంపెనీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. బీరు ప్రియులకు వైన్ షాపుల్లో ‘నో స్టాక్’ బోర్డు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఎండ తీవ్రత పెరగడంతో బీర్ లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ర్టంలో 13 కంపెనీలు బీర్లు తయారు చేస్తుండగా, రెండు షిఫ్టుల్లో కార్మికులు బీర్లు తయారు...