సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ఇంటర్ మీడియట్, పదవతరగతి సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్, పదవతరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై ఆయా శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22 నుండి 29 వరకు 30 కేంద్రాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుండి 12 గంటల...