Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 May 2025, 6:09 pm Posted by : ramakrishna

సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : ఇంటర్ మీడియట్, పదవతరగతి సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్, పదవతరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై ఆయా శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22 నుండి 29 వరకు 30 కేంద్రాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుండి 12 గంటల వరకు, రెండవ సంవత్సరం మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు నిర్వహించడం జరుగుతుందని, జిల్లో 5088 మంది విద్యార్థులు మొదటి, 3873 మంది విద్యార్థులు రెండవ సంవత్సరం విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.  ప్రాక్టికల్ పరీక్షలు 3.6.2025 నుండి 6.6.2025 వరకు ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక కేంద్రంలో నిర్వహించ డం జరుగుతుందన్నారు. అదే విధంగా పదవ తరగతి విద్యార్థులు 3 కేంద్రాల్లో 695 మంది విద్యార్థులు తేది 3.6.2025 నుండి 13.6.2025 వరకు ఉదయ. 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆయా పరీక్షల నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లను నియమించుకోవాలని తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద 163 బి.ఎన్.ఎస్.ఎస్. ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీకలు జరిగే కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలనీ, పరీక్ష కేంద్రాల్లోకి ఎవరిని కూడా సెల్ఫోన్ అనుమతించబోమని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో అత్యవసర మెడికల్ కిట్, ఒఆర్ఎస్ పాకెట్లుతో పాటు ఎఎన్ఎం లను నియమించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వివిధ గ్రామాల,ప్రాంతాల నుండి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా సమయానుకూలంగా బస్సులను ఆయా రూట్లలో నడిపించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో పంచాయతీ,మున్సిపల్ సిబ్బందిచే పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆన్సర్ పేపర్ల బండిల్స్ లను నిర్దేశిత ప్రాంతాలకు పోస్టు ద్వారా పంపేందుకు పోస్టల్ శాఖ సహకరించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన టీచర్ లను ఇన్విజిలేషన్ విధులకు హాజరయ్యేందుకు డిప్యూటీ చేయాలని తెలిపారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సలాం, జిల్లా విద్యా శాఖాధికారి రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్ర శేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్, ఆర్టీసీ డిపో మేనేజర్ కరుణశ్రీ, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.