Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 August 2025, 7:11 pm Posted by : ramakrishna

పట్టణ అభివృద్ధి పనుల పర్యవేక్షణ

బతుకమ్మ, బోధన్ :  బోధన్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సబ్ కలెక్టర్ వికాస్ మాతో, మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ కలిసి పర్యవేక్షించారు. 15వ వార్డు పాన్ గల్లీలో డ్రైనేజ్ పై వేసిన కల్వర్టుల నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానికులతో మాట్లాడుతూ కాలనీలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు వ్యక్తం చేసిన ఇబ్బందులను గమనించి తక్షణమే పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత 15, 16 సహా పలు వార్డులలో జరుగుతున్న పనులను ఇద్దరూ పరిశీలించారు. పనుల నాణ్యతలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే పనులు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మౌలిక వసతులు అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, పట్టణ అభివృద్ధి కోసం ఎలాంటి రాజీ పడబోమని సబ్ కలెక్టర్ వికాస్ మాతో స్పష్టం చేశారు.

Supervision of urban development works