నిజామాబాద్, బతుకమ్మ : గణేష్ నిమజ్జనం నిర్వహిస్తున్న బాసర, ఉమ్మడి బ్రిడ్జి , బోధన్ , బోర్గాం తదితర ప్రదేశాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య గురువారం అర్ధరాత్రి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పోలీస్ శాఖ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేసిందన్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ , భద్రతా పరంగా అన్ని అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకారాన్ని అందించాలని , ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు డయల్ చేయాలని లేదా సమీప పోలీసులను సంప్రదించాలని తెలిపారు. ఆయన వెంట ఏసీపీలు , సీఐలు , ఎస్సైలు, బందోబస్తు సిబ్బంది పాల్గొన్నారు.
