నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జి జి హెచ్ ఆసుపత్రిలో గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ కి చెందిన ఒక మైనర్ బాలిక క్రిటికల్ స్టేజ్ లో రావటం జరిగిందని, తనతో ఎవరు అటెండర్లు లేకపోయిన, ట్రీట్మెంట్ ఇచి ప్రత్యేక శ్రద్ధ తీస్కోవడం జరిగిందని ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రతిమరాజు తెలిపారు . కానీ క్రిటికల్ స్టేజ్ లో రావటం వల్ల బ్రతికించలేకపోయామన్నారు. ఆమె ఒక శిశువు కి జన్మనిచ్చి పరిస్థితి విషమించడంతో మరణించిందన్నారు. శిశువు కి శ్వాస సమస్య వల్ల (46) రోజులు ఎన్ ఐ సి యు లో ఉంచి కాపాడడం జరిగిందన్నారు. కొన్ని కారణాలవల్ల ఆ మైనర్ బాలిక భర్తని పోలీసులు అరెస్టు చేయడం జరిగిందన్నారు. అనాధగా మిగిలిన ఆ శిశువుని మానవతావాదంతో సూపరింటెండెంట్ “ఆకర్ష” అని నామకరణం చేసి శిశు గృహ సిబ్బంది కి అందజేశారు. దీనికి సంబంధించిన కేసు పోలీసుల దర్యాప్తులో ఉందని ఆమె తెలిపారు.