Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2025, 9:43 pm Posted by : ramakrishna

కాశ్మీర్ లో సూపర్ బ్రెయిన్ యోగ గుంజిళ్ళ కార్యశాల

  • అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు

 

న్యూడీల్లీ, బతుకమ్మ : మెదడును పదునుబెట్టే సూపర్ బ్రెయిన్ యోగ అయిన గుంజిళ్ళ (పశీకీలు) కార్యశాలను ఆదివారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంత నాగ్ జిల్లా కొకర్ నాగ్ తహసీల్ పరిధిలోని హన్ గుల్ గుండ్ గ్రామంలోని ఓ అంగన్వాడీ సెంటర్ లో నిర్వహించినట్లు గుంజిళ్ళ అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు తెలిపారు. ఈ కార్యశాలలో గుంజిళ్ళ (ఉట్ బైట్) యొక్క ప్రయోజనాలను ఆయన వివరిస్తూ ఈ గుంజిళ్ళ వ్యాయామం మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని ఆయన తెలిపినారు. మన దేశంలో పాఠశాలలో గుంజీళ్లను ఉతక్ బైఠక్ అని ముర్గా శిక్ష అనే పేర్లతో తీయించేవారన్నారు. మన భారత ఉప ఖండానికి మాత్రమైన పరిమితమైన గుంజీళ్లు సూపర్ బ్రెయిన్ యోగ అనే పేరుతో విశ్వవ్యాప్తమైందన్నారు. సూపర్ బ్రెయిన్ యోగ అనేది గుంజీళ్ళ మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగ చేయడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని, తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను విద్యార్థులకు వివరించిన్నట్లు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ద, సమస్యా పరిష్కారం, అభ్యసనం, గుర్తుంచుకోవడం, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, మానసిక సమతుల్యత మొదలైనవి పెంపొంది, సమస్యలు,ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపినారు. యోగ ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో సూపర్ బ్రెయిన్ యోగా వలన విద్యార్థులకు  మేలు జరుగుతుందని అన్నారు. కావునా గుంజీళ్లు తీయడాన్ని శిక్షగా కాకుండా, శిక్షణగా పరిగణించాలని అన్నారు. బహుళ ప్రయోజనాలు ఉన్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాలలో శిక్షణలో భాగంగానే పరిగణించి అమలు చేయడం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చునని అందె జీవన్ రావు తెలిపినారు.  ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించినట్లు డాక్టర్ రఫియా హసన్ అందె జీవన్ రావు వివరించిన అంశాలను తెలుగు నుండి కాశ్మీరీ భాషలో తర్జుమా చేసి వివరించినట్లు తెలిపారు.

Super Brain Yoga Camp Workshop in Kashmir