Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 4:47 pm Posted by : ramakrishna

పది ఫలితాల్లో సుంకేట్ ప్రభుత్వ పాఠశాల ప్రభంజనం

  • మండల్ టాపర్ గా సుంకేట్ విద్యార్థి బండి అనుశ్రీ 561 మార్కులు
  • 12 మంది గాను 11 మందికి 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు

 

బతుకమ్మ,మోర్తాడ్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలలో 12 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 11 మంది 500కు పైగా మార్కులు సాధించారని ఒక విద్యార్థి 499 మార్కులు వచ్చాయని తెలిపారు. బండి అనుశ్రీ 561/600 మార్కులతో మండల టాపర్ గా నిలిచారని పేర్కొన్నారు. రెండో స్థానంలో అంకం శ్రీహిత 556/600 మార్కులతో నిలిచారని తెలియజేశారు. పాఠశాలలో 100% ఫలితాలు సాధించడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాల ఆవరణంలో మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sunket Government School excels in 10th results