Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 December 2025, 3:31 pm Posted by : ramakrishna

సర్పంచ్ బరిలో ఇందూరు సునీత

  • రుద్రూర్ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా

 

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో  గత పది సంవత్సరాలుగా రుద్రూర్ గ్రామ సర్పంచ్ గా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ తన దైన శైలిలో సేవలు అందించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం పై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలో  యువతి, యువకులకు గ్రామ పెద్దల సహకారంతో పేరణ స్టడీ సెంటర్ ను ప్రారంభించి, ప్రేరణ స్టడీ సెంటర్ లో ఉపాధ్యాయులతో ఉచిత శిక్షణ అందించి, యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, గ్రామ యువత పేర్కొన్నారు. గ్రామంలో ఏ సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నిలిపి ప్రజల గుండెల్లో నిలిచారని గ్రామస్తులు అంటున్నారు. పది సంవత్సరాలుగా గ్రామాభివృద్ధి కార్యక్రమాలల్లో చురుగ్గా పాల్గొని సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేసి గ్రామానికి ఎనలేని సేవలు అందించారని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా అసలైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పంపిణీ చేశారన్నారు. అదేవిధంగా కరోనా సమయంలో కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ప్రజలకు ఆపద వస్తే నేనున్నానంటూ భరోసా కల్పించారని, గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని సుందరీ కారణంగా తీర్చిదిద్దారని గ్రామ ప్రజలు అంనుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఇందూరు చంద్రశేఖర్ సతీమణి ఇందూరు సునీత సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆకాంక్షించారు.