క్షతగాత్రులను పరామర్శించిన సునీల్ కుమార్
బతుకమ్మ,మెండోరా: నిర్మల్ జిల్లా దిల్వాల్ పూర్ గ్రామ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మెండోరా మండల కేంద్రంలో చెందిన గౌరీ లక్ష్మీలు తీవ్రంగా గాయపడ్డారు. వారు నిర్మల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శుక్రవారం హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించారు.