Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2025, 7:03 pm Posted by : ramakrishna

భిక్కనూర్ లో కొనసాగుతున్న సమ్మర్ క్యాంప్

బతుకమ్మ, భిక్కనూరు: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి రాజ్ గంగారెడ్డి మంగళవారం తెలిపారు. దీనిలో భాగంగా  జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల భిక్కనూర్ లో ఈ నెల 1 నుంచి ప్రారంభమైన వేసవి శిబిరంలో కరాటే ,యోగా మరియు మెడిటేషన్ పై కరాటే ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6:00 నుంచి 9 గంటల వరకు శిక్షణ ఉంటుందని,   కరాటే తో పాటు ఆత్మరక్షణలో భాగంగా తమను తాము రక్షించుకోవడం,ఇతరులను  రక్షించడం నేర్చుకుంటారని మరియు శారీరక ఆరోగ్యం తదితర  అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి రాజ్ గంగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంపత్ విద్యార్థులు ఉన్నారు.