బతుకమ్మ,ముప్కల్: ప్రతి విద్యార్థి లో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని ఆ నైపుణ్యాన్ని వెలికి తీస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అని పాఠశాల చైర్మన్ సాయి రెడ్డి అన్నారు. ముప్కల్ మండలంలోని రేంజర్ల గ్రామంలో గల విజ్ఞాన్ పాఠశాలలో సోమవారం సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. ఈ క్యాంపులో వాలీబాల్, కబడ్డీ, క్యారం, చెస్, క్రియేటివ్ గేమ్స్, చిత్రలేఖనం, రైటింగ్ కిల్స్, యోగ తదితర అంశాలలో విద్యార్థులకు ఈ క్యాంపులో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈసమ్మ క్యాంప్ 15 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఈ క్యాంపును ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు.కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సోహెల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.