Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 8:38 pm Posted by : ramakrishna

ఇందల్వాయి ఎస్సైగా సుమలత బాధ్యతల స్వీకరణ

 

. . . ఇందల్వాయి తొలి మహిళా ఎస్సైగా రికార్డ్

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలానికి నూతన ఎస్ ఎచ్ ఓ గా భూక్య సుమలత నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు భూక్య సుమలత ఇందల్వాయి ఎస్సైగా నియామకం కాగా గురువారం మధ్యాహ్నం ఆమె పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ గతంలో ఎస్సైగా విధులు నిర్వహించిన జి సందీప్ ధర్పల్లి ఎస్సైగా నియమితులయ్యారు. ఇందల్వాయి ఎస్సైగా సందీప్ నియమితులై కనీసం రెండు సంవత్సరాలు గడుకముందే బదిలీ కావడం పట్ల పలువురు గుసగుసలు ఆడుతున్నారు. గత కొంతకాలంగా ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సందీప్ పై అనేక ఆరోపణలు ఉన్నాయని తెలుస్తుంది. అలాగే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశాల మేరకు కూడా ఇందల్వాయి మండలాన్ని వదిలి ధర్పల్లి ఎస్సైగా నియమించుకున్నారని తెలుస్తోంది. ఇది ఏమైనా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోనే ఇందల్వాయి ఎస్సై సందీప్ కొనసాగుతున్నారు. ఇది ఇలా ఉండగా ఇందల్వాయి ఎస్ఐగా సుమలత బాధ్యతలు స్వీకరించిన అనంతరం చట్టపరంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సూచించారు. చట్టాన్ని ఎవరు అతిక్రమించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.