Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2025, 8:33 pm Posted by : ramakrishna

హనుమాన్ నామస్మరణతో మార్మోగిన సుల్తాన్ పేట్

మద్నూర్, బతుకమ్మ: మండల కేంద్రంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో సోమవారం హనుమాన్ నామస్వరంతో మార్మోగింది. హనుమాన్ నామస్మరణ మహా పడిపూజ కార్యక్రమాన్ని హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించారు. హనుమాన్ స్వాములు భిక్ష కార్యక్రమం నిర్వహించారు భక్తిశ్రద్ధలతో పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ పేట్ స్వాములు సంతోష్, గణేష్, సంజు, బాలు, సిద్దు, లోకేష్ , వివిధ గ్రామాల స్వాములు,భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sultanpet, enthralled by the chanting of Hanuman's name