ప్రజోపయోగ పనులకు అనువైన స్థలాలను గుర్తించాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనుల నిర్మాణాల కోసం అనువైన భూముల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, నర్సింగ్ స్కూల్/కాలేజీలు, అంగన్వాడి కేంద్రాలు, గ్రంథాలయాలు తదితర వాటికి సొంత భవనాల నిర్మాణాల కోసం...