Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 June 2025, 7:28 pm Posted by : ramakrishna

మల్లు పల్లిలో ఒకరి ఆత్మహత్య

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన ఆకారం స్వామి(39) గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.  గత చాలా సంవత్సరాలుగా హైదరాబాదులో తన భార్య సంధ్యారాణి తో స్వామి నివసిస్తున్నాడు. అతడు మతిస్థిమితం లేక పలు ఆసుపత్రిలో చికిత్స పొందగా అప్పుల పాలయ్యాడు. గత నెల 29న ఇంటికి వెళ్తున్నానని చెప్పి మల్లుపల్లి కి వచ్చి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోగా కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై  తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.