ఇంటర్ లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య
. భిక్కనూరులో నిప్పంటిచుకున్న రెడ్డి పూజ భిక్కనూరు, బతుకమ్మ: ఇంటర్ ఫస్టియర్ లో ఫెయిల్ అయ్యానని మనస్తాపానికి గురైన రెడ్డి పూజ(17) అనే విద్యార్థిని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భిక్కనూర్ మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసకుంది. తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మతోపాటు ఉంటున్న పూజ కామారెడ్డిలోని ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదివింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో పూజ ఫెయిల్ అయ్యింది. అదే రోజు నానమ్మ ఊరిలో లేకపోవడంతో దగ్గరలోనే ఉన్న తన పెద్ద ఇంటికి...