Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 March 2025, 7:47 pm Posted by : ramakrishna

అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఎర్రమన్న కూచ్చ కు చెందిన సిత్తరి బాలకృష్ణ (28) స్క్రాప్ బిజినెస్ చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొన్ని రోజులుగా వ్యాపారం మంచిగా నడవక గత కొన్ని రోజుల నుండి బాలకృష్ణ అప్పులు చేయగా, అప్పుల భారం అధికమై అప్పులు చెల్లించలేక జీవితంపై విరక్తి చెంది రామలింగం భావి వద్ద వేపచెట్టుకు ఉరి వేసుకున్నాడు.ఇట్టి విషయమై బాలకృష్ణ తండ్రి అయిన కాశిరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.