ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

బోధన్, బతుకమ్మ : బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కడుపు నొప్పి భరించలేక బోధన్ కు చెందిన ఆరుగొండ మహేష్(30) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ  మచ్చేందర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. బోధన్ కు చెందిన ఆరుగొండ మహేష్ గత కొంతకాలంగా  కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 26న తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాలూరు గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని  భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.