Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2025, 4:49 pm Posted by : ramakrishna

ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య

లింగంపేట్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల్ ఐలాపూర్ గ్రామంలో గ్రామానికి చెందిన పొట్టివారి రామస్వామి (28) గత కొంత కాలంగా తీవ్రమైన నడుము నొప్పి తో బాధపడుతున్నాడు. అతని  ఆర్థిక పరిస్థితి బాగాలేక పోవడంతో పెద్ద ఆసుపత్రిలో చూపెట్టుకోలేదు. శుక్రవారం ఉదయం  భార్య విజయ వ్యవసాయ కూలీ వెళ్లగా మృతుడు ఇంటి వద్దనే ఉన్నాడు. అదే రోజు సాయంత్రం మృతుడు తల్లి చూడగా రామస్వామి తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయినాడు. మృతుడు నడుము నొప్పి బాధ భరించలేక జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని చనిపోయాడు అని భార్య విజయ దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని లింగంపేట్ ఎస్ఐ సుధాకర్ తెలిపారు.  మృతునికి భార్య ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు.