మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని ఎస్సీ, బీసీ కాలనికి చెందిన సేని గోపాల్(42) మనస్థాపంతో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మోర్తాడ్ ఎస్సై రాము తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం తన టీవీఎస్ ఎక్స్ఎల్ పై ఇంటిటికి తిరుగుకుంటు పూసలు, మరియు అమ్ముతుండే వాడు. వ్యాపారంలో నష్టం రావడంతో కొద్ది రోజుల నుండి ఏం పని లేక ఇంటి వద్దనే ఉంటు బాధ పడుతుండే వాడు. శనివారం ఉదయం 8 గంటలకు సేని గోపాల్ ఇంటి నుండి బయటకు వెళ్ళి మనస్థాపంతో రైల్వే స్టేషన్ కి కొద్ది దూరం ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య సేని పద్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోద్ చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.