Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 October 2024, 12:34 pm Posted by : ramakrishna

రైలుకింద పడి ఆత్మహత్య

ఆర్మూర్, బతుకమ్మ: అంకాపూర్ రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి మంగళవారం తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటుందని, వివరాలకు 8712658591 నంబర్ ను సంప్రదించాలని ఎస్సై సూచించారు.