Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 December 2024, 2:01 pm Posted by : ramakrishna

భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని ఆత్మహత్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని మనస్తాపంతో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని నాగారం 80క్వార్టర్స్ లో నివాసం ఉండే మీసాల కృష్ణ(44) మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కృష్ణ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె రాకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన మద్యం మత్తులో ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.