Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 May 2025, 3:37 pm Posted by : ramakrishna

ఫోన్ లో మాట్లాడుతున్నావని అన్నందుకు ఆత్మహత్య

నిజాంసాగర్, బతుకమ్మ: తరచూ ఫోన్ మాట్లాడుతున్నావని తండ్రి అనడంతో క్షణికావేశంలో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజాంసాగర్ మండలం చిన్న ఆరేపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొంకుల గంగారాం తన కొడుకు కొంకుల రాకేశ్ (20) తరచూ ఫోన్ లో మాట్లాడతుండడాన్ని గమనించాడు. ఎందుకు తరచూ ఫోన్ మాట్లాడుతున్నామని ప్రశ్నించడంతో రాకేశ్ కఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గంగారాం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.